జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు

54చూసినవారు
జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు
ఈనెల 3 నుంచి 7 వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో.. 38వ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ సబ్ జూనియర్ బాలుర పోటీలకు రాష్ట్ర జట్టును ఆ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ప్రకటించారు. బుధవారం కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల అభినందన సభలో స్పోర్ట్స్ ప్రమోటర్ జి.శ్రీధర్ రెడ్డి డి.ఎస్.డి.ఓ భూపతిరావులు కలిసి స్పోర్ట్స్ కిట్టును అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర హ్యాండ్ బాల్ జట్టు కోచ్ గా బడే సాహెబ్ వ్యవహరిస్తున్నట్లు సంఘం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్