ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహ వినియోగదారులకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ప్రధానమంత్రి సూర్యకర్ యోజన పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులు తమ ఇళ్ళ పై కప్పుపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.