జిల్లాలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇసుక సరఫరా

76చూసినవారు
జిల్లాలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇసుక సరఫరా
కర్నూలు జిల్లాలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. గురువారం సీఎం కలెక్టర్లు, జేసీలతో ఉచిత ఇసుక పై సమీక్షించారు. జిల్లాలోని పరిస్థితులను సీఎంకు కలెక్టర్ వివరించారు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా 7500 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇసుకపై జీఎస్టీ తగ్గడంతో రూ. 326 నుంచి రూ. 320కు తగ్గించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్