కర్నూలులో నదిలో మునిగి స్వీపర్ మృతి

65చూసినవారు
కర్నూలులో నదిలో మునిగి స్వీపర్ మృతి
కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిలో మునిగి జగ్గుల రాముడు (44) మృతి చెందాడు. నగర్‌కు చెందిన రాముడు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తాగిన మత్తులో బహిర్భూమికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. రాముడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్