కర్నూలు జిల్లా టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి శనివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో మహిళల భద్రత, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ప్రజల రక్షణకు కట్టుబడి ఉందని వైకుంఠం జ్యోతి తెలిపారు. మున్ముందు మరింత ప్రజాభిమానంతో పోలీస్ శాఖ ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.