ఎందరో వీరుల త్యాగఫలమే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు కె బాబురావు అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ దేశ నాయకులు చేసిన కృషిని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్య మ స్ఫూర్తితోనే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఆయన చెప్పారు.