స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధన కోసం అనువైన ప్రణాళికలను రూపొందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా జిల్లా ఆదేశించారు. వృద్ధిరేటు సాధించేలా ప్రణాళికను రూపకల్పన చేయాలని సూచించారు. గురువారం కర్నూలులో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనపై కలెక్టర్ సమీక్షించి, మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్యం, విద్య నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖల్లో ఆచరణ సాధ్యమయ్యే ప్రణాళికలను రూపొందించాలన్నారు.