వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేస్తాం
విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు నిత్యావసర కిట్లు అందజేస్తామని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన కిట్ల తయారీ గురించి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.