యోగ కార్యక్రమం ఆరోగ్య కోసమేనని దీనిని అందరూ అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ప్రజలను కోరారు. గురువారం కర్నూలు చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజు దగ్గర చేపట్టిన యోగ కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో యోగా నిర్వహణతో టూరిజం అభివృద్ధి కూడా జరుగుతోంది. స్థానిక అధికారులు, విద్యార్థులు, ప్రజలు యోగాసనాలు ప్రదర్శించారు.