పెద్దకడబూరు గ్రామ శివారుల్లోని ఉపాధి కూలీలు పని ప్రదేశంలోనే గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ జెండాలను చేతబూని భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. ఎందరో మహానీయుల త్యాగఫలితమే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని టీడీపీ నేత తలారి అంజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.