స్వాతంత్ర సమరయోధుడు, రైతు బాంధవుడు, బడుగుల ఆశాజ్యోతి, శ్రామిక వర్గ ప్రతినిధి, ఉద్యమాల నిప్పు కణిక సర్దార్ గౌతు లచ్చన్న అని ఏపీ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శివన్న కొనియాడారు. శుక్రవారం గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత "సర్దార్"అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అన్నారు.