మంత్రాలయంలో తాలూకా, మండల కమిటీల ఆధ్వర్యంలో శనివారం ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీయుడబ్ల్యూజే జెండా కట్టను ఎస్ఐ వేణుగోపాల్ రాజు ప్రారంభించి, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీయుడబ్ల్యూజేకి అనుకూలంగా పాత్రికేయులు నినాదాలు చేశారు. ఇందులో ఏపీయుడబ్ల్యూజే నేతలు జయరాజు, ఉసేని, షాబువలి, భీమ్ రాయుడు, రానోజిరావు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.