నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు

60చూసినవారు
నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు
పెద్దకడబూరు మండలంలోని ముచ్చిగిరి శివారుల్లోని గంగమ్మ గుట్ట కొండలలో నెట్టకల్ నరసప్ప, మేకల తిక్కన్న నాటు సారాయి తయారు చేస్తుండగా బుధవారం ఎస్ఐ నిరంజన్ రెడ్డి పోలీసు సిబ్బందితో దాడులు చేశారు. నిందితులు ఒకొక్కరి నుంచి ఐదు లీటర్ల నాటు సారా చొప్పున మొత్తం 10 లీటర్లను స్వాధీనం చేసుకొని 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్