ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఎస్ఐ

56చూసినవారు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఎస్ఐ
పెద్దకడబూరు మండల పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్ఐ నిరంజన్ రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్ లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించి తగు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలన్నారు. ఆటోలను ఎక్కడబడితే అక్కడ నిలబెట్టరాదన్నారు. అనంతరం ఆటో యునియన్ నాయకులు ఎస్ఐను సన్మానించారు.

సంబంధిత పోస్ట్