మంత్రాలయం నియోజకవర్గం మాధవరంలోని తెదేపా కార్యాలయంలో కూటమి ప్రభుత్వ ఏడాది విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్రానికి చల్లని చంద్రుడు ఉన్నంతవరకూ అభివృద్ధి శాశ్వతమని, జగన్ పాలన రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్షాన్ని సవాల్ చేశారు.