స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతీయ నాయకుల వేషధారణలో పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం హైస్కూల్ చిన్నారులు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతగానో అలరించారు. సోల్జర్స్, భారతమాత, నెహ్రూ, అంబేద్కర్, మదర్ థెరిస్సా వంటి పాత్రలను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు మాట్లాడిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.