మంత్రాలయం మండలం చెట్నెహళ్లిలో శ్మశాన వాటికకు కంచె ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా, గ్రామస్తులతో వివాదం చోటు చేసుకుంది. ఆదివారం అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై 25 మంది పురుషులు, నలుగురు మహిళలపై కేసు నమోదైంది. వీఆర్వో ఫిర్యాదుతో ఎస్సై శివాంజల్ దర్యాప్తు ప్రారంభించారు. పాతిన పిల్లర్లు తొలగించిన విషయమూ ఫిర్యాదులో పేర్కొన్నారు.