ఏకాదశి సందర్భంగా మంత్రాలయలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు మొదట గ్రామదేవత మంచాలమ్మను దర్శించి, తర్వాత రాఘవేంద్ర స్వామి నిజ మూల బృందావనానికి వెళ్లారు. ఆదివారం కన్నడ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ మనవడు, రాఘవేంద్ర కుమారుడు యువరాజ్ కుమార్ మంత్రాలయానికి వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. భక్తులు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.