కౌతాళం మండలంలోని హాల్వి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు గురువారం టీడీపీ సీనియర్ నాయకులు ఉలిగయ్య స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని, ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని, మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం వచ్చిన మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాఠశాలకు ఎలాంటి సదుపాయాలు అవసరం వచ్చిన అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుంటామన్నారు.