తాతా సంక్షేమ ప్రధాత సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో మరువవద్దని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి కోరారు. గురువారం పెద్దకడబూరు మండలంలోని గవిగట్టులో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలను కలిసి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మళ్లీ ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తారని హామీ ఇచ్చారు. ఇందులో పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.