మంత్రాలయం మండలం చిలకలడోనలో రూ. 1. 22 కోట్ల రూపాయలతో కస్తూరిబా గాంధీ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఈ కార్యక్రమానికి టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, బిజెపి ఇంచార్జి ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని, భవన నిర్మాణం నాణ్యతగా జరగాలని ఆదేశించారు. మండల ఎంఈవో, ప్రిన్సిపాల్, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.