పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళంలో స్వాతంత్ర సమరయోధుడు క్రాంతి వీర సంగోలి రాయన్న జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. యువత స్వాతంత్ర సమరయోధుడు క్రాంతి వీర సంగోలి రాయన్నను ఆదర్శంగా తీసుకోవాలని గొర్రెల ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్ కేపీ యల్లప్ప పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని కిత్తూరు సామ్రాజ్యానికి సైన్య అధ్యక్షుడుగా ఉండి తెల్ల దొరల భరతం పట్టిన వీరుడు సంగోలి రాయన్న అని కొనియాడారు.