మంత్రాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు

65చూసినవారు
మంత్రాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు
మంత్రాలయంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో పట్టణ వాసుల కోసం శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి అర్చకులు సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి మాత జ్ఞానం, వాక్కు, విద్య దేవత అని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం చిన్నారులకు బ్యాచుల వారీగా అక్షరాభ్యాసం చేసి, విద్యార్థులకు పలకలు, నోట్లు, పెన్నులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్