మండల కేంద్రమైన పెద్దకడబూరు గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉండి మధ్యాహ్నం దాదాపు అరగంటకు పైగా చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి దాదాపు కోత దశకు చేరగా వర్షం రాకతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రేపటి వరకు వర్ష సూచన ఉన్న కారణంగా రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు.