ఆధునిక వ్యవసాయ పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని రైతు శిక్షణా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు జిఎం వేదామణి, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర రైతులకు సూచించారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని కంబదహళ్ గ్రామ శివారుల్లోని పంటలను ఏఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో పరిశీలించారు. రైతులకు మిరప, పత్తి, వేరుశెనగ పంటల్లో చేపట్టవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు.