కౌతాళంలో వర్షానికి ఇళ్లు జలమయం – కాలనీ వాసుల ఆందోళన

130చూసినవారు
కౌతాళంలో వర్షానికి ఇళ్లు జలమయం – కాలనీ వాసుల ఆందోళన
కౌతాళం మండల కేంద్రంలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో గ్రామంలోని ప్రధాన వీధులు జలమయమయ్యాయి. వైఎస్సార్ సర్కిల్‌, స్టేట్ బ్యాంకు ఎదురు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పారిశుద్ధ్య కార్మికులు నివసించే ఈ కాలనీలో వర్షం ప్రతిసారి ఇబ్బందులు పెడుతోందని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు తెలియజెప్పినా చర్యలు లేవని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్