మానవత్వం చాటుకున్న విద్యార్థులు

73చూసినవారు
మానవత్వం చాటుకున్న విద్యార్థులు
పెద్దకడబూరులో ఇటివల షాట్ సర్క్యూట్ తో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. అగ్నిప్రమాద బాదిత కుటుంబం నుండి ఏపీ మోడల్ స్కూల్ లో హెబ్సిబా అనే అమ్మాయి 6వ తరగతి చదువుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేయి చేయి కలిపి రూ. 6, 800 సేకరించి మంగళవారం హెబ్సిబాకు ప్రిన్సిపాల్ రంగన్న ఆర్థిక సహాయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్