పెద్దకడబూరు గ్రామంలోని ఆదిఆంధ్ర ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ కిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం హెచ్ఎం సుప్రసాద్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు.