కౌతాళంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమరేష్ గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతీయ నాయకులు మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ సుబ్బరాజు, వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, కో ఆప్షన్ మెంబర్ మాబుసాబు, సర్పంచ్ పాల్ దినకర్, నదీచాగి ఎంపీటీసీ లింగనగౌడ, సీనియర్ అసిస్టెంట్ సత్యన్న పాల్గొన్నారు.