శ్రీ మఠం వేద పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

78చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలోని వేద పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలను అందరికీ పంచాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్