ఐరనగల్: కల్వర్టు నుంచి కిందపడి వృద్ధుడు మృతి

53చూసినవారు
ఐరనగల్: కల్వర్టు నుంచి కిందపడి వృద్ధుడు మృతి
కోసిగి మండల పరిధిలోని ఐరనగల్ సమీపంలో బుధవారం కల్వర్టు నుంచి పడిపోయి 64 ఏళ్ల జగ్గుల మద్దిలేటి మృతి చెందాడు. గతంలో కడపలో బీడీ కార్మికుడిగా పనిచేసిన ఆయన పింఛన్ కోసం కడపకు వెళ్లి తిరిగి రైలులో మంత్రాలయం రైల్వే స్టేషన్ వచ్చాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ, పొలాల్లోని కల్వర్టుపైన నిద్రించాడు. కల్వర్టు నుంచి కిందకు పడిపోయి మృతి చెందాడు. పొలాల్లో రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్