జర్నలిజం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎస్ఐ నిరంజన్ రెడ్డి హితవు పలికారు. శనివారం పెద్దకడబూరులోని ప్రెస్ క్లబ్ వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎస్ఐ నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పాత్రికేయులు తమ దినపత్రికలలో ప్రచురిస్తేనే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.