కోసిగి: తుంగభద్ర ఒడ్డున యువకుడి ఆత్మహత్య

76చూసినవారు
కోసిగి: తుంగభద్ర ఒడ్డున యువకుడి ఆత్మహత్య
కోసిగి మండలం తుంబిగనూరుకు చెందిన నాగరాజు (27) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న నాగరాజు, భార్య నాగమ్మ 15 రోజులుగా పుట్టినింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్నాడు. తుంగభద్ర నది ఒడ్డున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై హనుమంత రెడ్డి, ఏఎస్ఐ నాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్