కోసిగి మండలంలోని కందుకూరు, అగసనూరు గ్రామాల్లో సుమారు 100 ఎకరాల భూమి కబ్జాపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ వారు రైతులతో సమావేశమయ్యారు. గురువారం వారు బాధితులకు న్యాయం జరిగే వరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసిపి నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పని చేస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.