కర్నూలు: డిజిటల్ అరెస్టు మోసం, ప్రజలు అప్రమత్తంగా ఉండండి

16చూసినవారు
కర్నూలు: డిజిటల్ అరెస్టు మోసం, ప్రజలు అప్రమత్తంగా ఉండండి
కర్నూలు జిల్లాలో డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వారు వీడియో కాల్ ద్వారా పోలీసు అధికారుల పేరుతో బెదిరించి, డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకూడదని, 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.

సంబంధిత పోస్ట్