మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోల్మాన్ పేటలో టీడీపీ నిర్వహించిన 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో శనివారం మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.