కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదిలో భారీ వరద నీరు చేరుతోంది. ఈ పరిణామం నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి 63 వేల క్యూసెక్కులు నీటిని వదిలారు. శనివారం కర్నూలు జిల్లాలోని నాగలదిన్నె, మాధవరం బ్రిడ్జిల వద్ద నది ఉధృతంగా ప్రవహించడంతో భక్తులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా, మంత్రాయం వద్ద నది ఒడ్డులో భక్తుల సందడి కనిపించింది.