మాధవరం: టీబీతో బాధపడుతున్న మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య

51చూసినవారు
మాధవరం: టీబీతో బాధపడుతున్న మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య
మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన బోయ ఆంజనేయ భార్య బోయ తలారి లక్ష్మీదేవి (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవి గత పదేళ్లుగా టీబీతో బాధపడుతుండేది. బళ్లారి, రాయచూరు, కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నయం కాలేదు. వ్యాధి తీవ్రం కావడంతో మనస్తాపానికి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వవేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సంబంధిత పోస్ట్