మంత్రాలయం: ఎస్సై నిరంజన్ రెడ్డి బదిలీ రద్దు

మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం ఎస్సై నిరంజన్ రెడ్డి బదిలీ రద్దు అయినట్లు బుధవారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటివల జిల్లాలో జరిగిన 18 మంది ఎస్సైల బదిలీలలో భాగంగా ఆయనను గూడూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కానీ తాజాగా ఆయనను పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లోనే కోనసాగిస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.