తుంగభద్ర డ్యాం నుంచి 20 గేట్లు ఎత్తి 58, 260 క్యూసెక్కుల నీటిని వదలిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం తహసీల్దార్ రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నదిలోకి వెళ్ల రాదని సూచించారు. తుంగభద్ర నదిని ఆమె పరిశీలించారు. ఆమెతో సీనియర్ అసిస్టెంట్ జయరాం రెడ్డి, వీఆర్డీ భీమన్నగౌడ్, ఇతర సిబ్బంది ఉన్నారు.