మంత్రాలయం: టీటీడీపై భూమన దుష్ప్రచారం: రాఘవేంద్ర రెడ్డి

73చూసినవారు
మంత్రాలయం: టీటీడీపై భూమన దుష్ప్రచారం: రాఘవేంద్ర రెడ్డి
టీటీడీలో గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి సత్య ప్రచారాలు చేయడం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర అని మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి విమర్శించారు. ఆదివారం మంత్రాలయంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో వెంకటేశ్వరస్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారన్నారు.

సంబంధిత పోస్ట్