మంత్రాలయం సీఎం రిలీఫ్ ఫండ్‌ చెక్కులు పంపిణీ

84చూసినవారు
మంత్రాలయం సీఎం రిలీఫ్ ఫండ్‌ చెక్కులు పంపిణీ
మంత్రాలయం నియోజకవర్గంలో 28 మంది లబ్ధిదారులకు రూ. 17,22,920 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బుధవారం అందజేశారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్. రాఘవేంద్రరెడ్డి బాధితులకు నిధులు సకాలంలో అందుతాయని పేర్కొన్నారు. వైద్యం కోసం పేదలకు సహాయంగా సీఎం సహాయ నిధి ఎంతో మేలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి, చూడి ఉలిగయ్య, ఎన్. రఘునాథ్ రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్