మంత్రాలయం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గుడిసె దగ్ధం

77చూసినవారు
మంత్రాలయం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గుడిసె దగ్ధం
కోసిగి పట్టణంలోని కడపాళెంలో శుక్రవారం కౌతాళం నాగరాజు, పార్వతి దంపతుల గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుడిసెల పైభాగంలో విద్యుత్ తీగలు నిప్పు రవ్వలు పడడంతో మంటలు చెలరేగి, స్థానికుల ప్రయత్నం ఫలించలేదు. గుడిసెలో రూ. 50 వేల నగదు, 2 తులాల బంగారం, నిత్యావసరాలు, బట్టలు, టీవీ సహా రూ. 4 లక్షల మేర నష్టం జరిగింది. ప్రభుత్వ సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్