కౌతాళం మండలంలోని ఉరుకుంద-కౌతాళం గ్రామాల మధ్య మంగళవారం రాత్రి రెండు బైకులు ఢీకొనడంతో పూజారి వీరేష్ (45) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన కూతురు జయశ్రీని పాఠశాలకు వదిలేందుకు బైక్‌పై వెళ్లిన సమయంలో, మరో బైక్‌పై వచ్చిన మంగళి రవి వేగంగా వచ్చి ఢీకొనడంతో పూజారి వీరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని కొడుకు రమేష్ తీవ్రగాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందుతున్నాడు.