కౌతాళం మండలం మెలిగేనూరు గ్రామంలో వెలిసిన శ్రీరామలింగేశ్వర స్వామి నూతన రథోత్సవం, కందుకూరులో రామలింగేశ్వర స్వామి కుంభోత్సవ వేడుకలకు టీడీపీ ఇన్‌ఛార్జి రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ సందర్శనకు వచ్చిన రాఘవేంద్ర రెడ్డికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.