కోసిగి మండలం దొడ్డి బెళగల్ లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరి నుంచి 240 మద్యం ప్యాకెట్లు, మట్కా చీటీలు, రూ. 11, 500 నగదు స్వాధీనం చేసుకున్నామని బుధవారం ఎస్సై హనుమంత రెడ్డి చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హనుమంతరెడ్డి హెచ్చరించారు.