మంత్రాలయం: టీడీపీ సంస్థాగత కమిటీ ఏర్పాటుకు సమావేశం

73చూసినవారు
మంత్రాలయం: టీడీపీ సంస్థాగత కమిటీ ఏర్పాటుకు సమావేశం
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ అబ్జర్వర్ దేవెళ్ల మురళీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ సంస్థాగత కమిటీ ఏర్పాటుకు సమావేశమయ్యారు. మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సమర్థతను గుర్తించి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు. అకాల మరణం చెందిన టీడీపీ నాయకులు జ్ఞానేష్ సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని మౌన ప్రార్థన చేశారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలే మన లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్