మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండల కేంద్రం నుంచి గురువారం దాదాపు 30పైగా కుటుంబాలు రెండు వాహనాల్లో తెలంగాణకు వలసలు పోయారు. గ్రామంలో ఇంత వరకు వ్వవసాయ పనుల వల్ల పత్తితీత పనులు ఉండేవని ప్రస్తుతం పనులు తగ్గిపోయాయని కూలీలు చెబుతున్నారు. కౌతాళంలోని మాసలగేరి, బైటిగేరి నుంచి కూలీ లు వలసలు పోయారు. తల్లిదండ్రులతోపాటు వారి పిల్లలు చదువుకుంటున్న బడిఈడు పిల్లలు కూడా వలస బాట పట్టారు.