కర్నూలు జిల్లా నుంచి రెండోసారి ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికైన ఎమ్మెల్సీ బీటీ నాయుడికి ఏప్రిల్ 13న ఆదివారం సన్మానం నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయంలో జరగనుందని, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు.