మంత్రాలయం పట్టణంలో వెలసిన శ్రీరాఘవేంద్ర క్షేత్రంలో జ్యేష్ఠ మాస తదియ శనివారాన్ని పురస్కరించుకుని శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు అంబారీపై భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వేద ఘోష, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపు జరిగింది. సెలవుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు.